పుట:2015.333901.Kridabhimanamu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వేల్పు, ఈ దేవి యిలువేల్పుగా గల యిండ్లలో వివాహాది శుభకార్యములు జరగినతోడనే యక్కలకొల్పుజరగును. ఆంగ్లేయుల యుద్దగీతములవలె నుద్రేకజల్నక మైనగాఅనఫణితిని కామేశ్వరిపాట వీరవాద్యములతో నానాడు పాడుదురు. ఆపాటతీవరములో స్త్రీలకు కొందఱకు సివమెత్తును. ఆ యర్చనము జరగునా డెంత తొందరించినను భోజజము లగుటకు సూర్యాస్తమయ మగును. "అక్కలు లేచేటప్పటికి నక్కలు కూస్తయి" అని నానుడి. నే నీయక్కల కధ నముద్రితములుగానున్న యాదిలక్ష్మీవిలాసము, కామేశ్వరి చరిత్రము నను గ్రంధములమూలమున గనుగొన గల్గితిని. *కామేశ్వరి నిలువేల్పునుగా నర్చిందువారు పలువురెఱుగ గోరుచున్నారు గాన తత్కధాసారము నిక్కడ తెలుచున్నాడను.

                      కామేశ్వరికధ
  శ్రీ మహావిష్ణువు శ్రీరామావతారమున నుండగా శ్రీమహాలక్ష్మి చూచి తన్మూర్తిని వలచెను.  తన వాంచ

  • కామేశ్వరి పాట 'స్త్రీలపాటలు ' అను పేర ఏలూరు మంజువాణి ప్రెస్సులో ముద్రితములయిన మాడు సంపుటములలో నొకదానగలదు. కాని యది యదికదోషములతో నందదుకులుగా నవవ్వితమై యున్నది. ఆ భణితితోనే దానికి బాతాంతరంగూడ గలదు. అది సరిగా మరల ముద్రింపదగినది.