పుట:2015.333901.Kridabhimanamu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జరుగుచుండెడివి. నేడును ఎఱగొల్ల లను పేరి దేసద్రిమ్మరి తెగవాండ్రు ఏకవీరాదేవికధల బాడుచుందురు. పరశురామ విజయము, పరశురామరామాయణము, మాహురమ్మకధ ఇత్యాదులు వారు పాడు ద్విపదప్రబంధం లిప్పుడును గలవు. 'మాహుర ' మనుపేరు గలగ్రామమున వెలసిన వగుటచే యేకవీరకు మాహురమ్మ యనియు నామాంతరము. ఏకవీరమ్మ కాకతమ్మకు సైదోడట! ఏకశిలానగరము రాజధానిగా నాంధ్రసామ్రాజ్య మెలినకాకతీయాంధ్ర చక్రవర్తులకు నీ కాకతమ్మ* యిలువేల్పు. ఆమెకు సైదోడగుటచే నీ యేకవీరకునుగూడ నేకశిలానగరమున గోవెల వెలసెను. ఏకవీరగుడి గడపగానే కామవల్లీమహాలక్ష్మి వలపును బాడుచు నొకజక్కులపురంధ్రి గానవచ్చెను తత్కధాది వర్ణనము కొంత గలదు. ఇందు గొంత విస్తరించి చెప్పవలసినవిషయ మున్నది. కామవల్లీ మహాలక్ష్మికే కామేశ్వరి యని నామాంతరము. ఏడుగు రక్కలలో గడగొట్టుదిఅనను కామవల్లీ మహాలక్ష్మి ముఖ్యురాలు కావున నామెపేరు ప్రధానముగా బేర్కొనబడుచున్నది. తక్కిన యార్వురకుని వేర్వేఱు పేరులు గలవు. మొత్తమున వారి కెల్లర కును 'అక్క ' లని పేరు. నేటికిగూద సర్వాంధ్రదేశమునను బ్రాహ్మణాది వర్ణముల వారికీ కామేశ్వరి (అక్కలు) యిలు


  • చూ. అనుబంధము