పుట:2015.333848.Kavi-Kokila.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ న కు మా రి

5

గొఱియల దొడ్డివెట్టియటకుం జనుదెంచినకుమారి, మౌనియౌ
 తరుణీనిగాంచ సమ్శయము దట్టెననంబున;నాతడుం గరాం
 తరమున గడ్డమాంచి నయనంబుల నార్చక.నేలజూచుచుం
 జిరము తలంపులన్ సుడినిజిక్కి యెఱుంగడు కాంతవచ్చుటన్.

  లలన్యునిట్లనె: మేల్కని
  కలగనుట యిదేమిసఖుండ,గాంచుమజనకున్:
  వెలవెలవాఱెను వదనము;
  బలముడిగిన యట్లుదోచు బాహులుకాళుల్.

అనివిని యుల్కిలేచి, చెలియా, యవునౌననిలోని తత్తరం
 బును వెలిదోపనీక, జలముంగొనిరమ్ము,తృషార్తివాయద్రా
 విన నొక కొంత మేలగును వేగమదెమ్మనం, బోయితెచ్చి చ
 ల్లని మలయూట నిర్మలజలంబులు, దప్పికదీర్చె దండ్రికిన్.