పుట:2015.333848.Kavi-Kokila.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

---వ న కు మా రి

అనియిటులు కొంతవఱకును
 అనునయవాక్యములు పల్కియాశా దీపం
 బును వెలిగించి, యవశ్యము
 చనవలయుట నేగె సతడసమ్మతి మయ్యున్,

ఏండ్లు చెల్లెగాని యింతకునాఱదు
 ఆపది వ్వె యెంత యక్కజంలో!
 ఏటబోవు మనుజుడెదురైన వరిపోచ
 పట్టుకొనుట జూడనిట్టిదేమొ?

పరభూపాల కరాళకంకదళన ప్రారంభ దుర్వారమౌ
 కరవాలంబు, శరాసనంబు లిషంపుల్ కార్తస్వరోరశ్చదం
 బురుశీర్షణ్యము భూమిబూడిచితినయ్యో! శౌర్యచిహ్నంబులి
 ద్ధర గర్భంబున ద్రుప్పుపట్టేడిని; క్షాత్త్రస్పూర్తియిట్లాయెనె!

ఆనవిని వీరపుంగవుడు నంగమునం బలకల్ జనింప గ
న్గొనల గిసాల శోణిమముగూడగ దిగ్గరలేచిచూచి యి
ట్లనియె నిశాత ఖడ్గము కరాజ్జమునను ధరియించి, చెప్పుమో
ఘనుడ వినున్ సమిద్దరణి గాఱియనెట్టిన దుష్టభూపతిన్.