పుట:2015.333848.Kavi-Kokila.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

చలపట్టి మంత్రి వేగుల
 బలమున సర్వంబుదెలిసి బహుదారుణ శి
 క్షుల విప్లవాగ్నినార్పెను.
 పలువురు మొగదార్లు కొఱతంబడి మరణింపన్

ప్రజలు భయపడి యన్య రాష్ట్రముల కేగ
 రాజపురి మాటుమణగిన యోజదోచు,
 వింతవింతల పన్నుల విత్తమూడ్చి
 రైతు నెత్తురుద్రావు దుర్జనుడు నృపతి.

ప్రస్తుతము పునర్యత్ని మాపత్కరంబు
 గాన, సమయంబు వేచిన కార్యమగును;
 తమకు భక్తులమైన మాతనువులందు
 ప్రాణముంచెడు నందాక బ్రతిన నిడము.

అనిచచియించి మీకిచట నాపదగల్గిన గల్గవచ్చు; నీ
 వనమున కవ్వలన్ గిరులపట్టుల బచ్చికలోయగాపురం
 బున కనుకూలమైన సొనపొంతల గొఱ్ఱెల మేపికొంచు మీ
 దినములు పుచ్చుచుండుడు, విధిప్రతికూలత మాఱకుండునే.