పుట:2015.333848.Kavi-Kokila.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మ రి---

నాకైప్రాణము విడిచెను
వీకన్ మాసైన్యమెల్ల వీరస్వర్గ
శ్రీకమ్ముగ, నరుదెంచితి
నీకష్టము లనుభవింప నే నివ్వనికిన్.

కొందఱు సైనికుల్ ప్రజలుగోరికి విప్లచముం బొనర్చి నన్
ముందఱి యట్ల రాజ్యమున భూపతిగా నొనరించి సౌఖ్యముల్
పొంద; దదర్ధమై విపినభూమి రహస్య సమీక తంత్రముల్
సందెడలంగనీని మతిచాతురి సల్పుచునుండి రత్తఱిన్

గొఱియల మేప దోల్కొనుచు గొల్లల వెషములన్ ధరించి శా
బర జనవాసముల్ దిరిగి, పల్లెలలో జరియించి, నాపయిం
చెరుగు ప్రియంబు, నన్యపృధినీపతిపై జెలరేగు ద్వేషమున్
మఱిమఱిరేపుచుం బ్రజల మానసముల్ హరియించుకోరికన్

జతనంబు సలపుచుండిరి
 మతి మ్నతులు నాదుహితులు; మాక నృపాజ్ఞన్
 మృతిగలుగు ననుభయంబున
సుతనున్ ననుజేర్చి రడవిసోనల యెడకున్