పుట:2015.333848.Kavi-Kokila.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నలజారమ్మ

నలజారమ్మయనంగను
సలలితమౌపేరుగల్గిసారసముఖి, కా
పుల పూబోణుల దానొక
తలమానికమటుల దనరె దలమా పొగడన్

నిమ్మపండువంటి నెమ్మేని జిగితోడ
గురుల నీలిపసలు గునిసియాడ,
గంగ యముననీరు గలిసిపారినరీతి
జెలియసోయగంబు చెలువుమీఱె/

కన్నుదమ్ములు పెద్దవేగాని, కొనల
బచ్చనొడిచిన సోగలు ఫరిఢవిల్ల
గాంచువారికి మఱియింతగాగ, జిగుల
గ్రుమ్మరించుచు గండోయి కులుకులెసగు

సందిట బచ్చలబాజీ
బందులపస నొసంగుచుండు బచ్చనొడుపు బూ
వుందీవల యందము లా
కుందరదన బాహులతకుం దొడవులనన్