పుట:2015.333848.Kavi-Kokila.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

---వ న కు మా రి

తలపని తలపుగ వచ్చితి
తలకొంటివి రక్షకొఱకు దడయక వని క
వ్వల కొంచెము దూరము చన
గలదు కుటీరంబు, నన్ను గడుపుమ యటకున్

అలవుంగొని యా మీదట
దెలిపెద నా చరిత సేదదేఱిన వెనుకన్;
బలహీనత మాంద్యమున
న్నలయించెడు జాగుసేయ కటుగొని పొమ్మా.

అని యిటుపల్కుచు ముద్దుల
తనయం దలపోసి తఱగని దు:ఖ
మ్మున గుంది వనకుమారీ
యని యొక నిట్టూర్పువిడిచె నశ్రులతోడన్

వృద్ధు డిటులంబల్క వినియను యువకుండు
వనకుమారి యొకతె ? వనములందు
నామె యున్నదొక్క యలంతి ప్రాయముగల్గి
గొఱ్ఱెలమేప గిరుల దెరుగుచున్నె?