పుట:2015.333848.Kavi-Kokila.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

---వ న కు మా రి

పరిణయర్హ వయస్కయు బ్రణయ జలధి
నోలలాడేడు పూఱేకు టోడతనయ
భీకరాకణ్య తలముల బెగ్గలింప
మఱుగు పఱచునొ మరణంపు మబ్బునున్న

ప్రజల యత్నంబులెల్ల విష్పలములయ్యె
 హీతులతంత్ర ముపద్రవ హేతువయ్యె;
దలచినది మున్గె; దలవని తలంపుదేలె;
 ఏమిసేయు నరుడదృష్ట మెదురు దిరుగ?

అల్లు పందిరి నెడబాప నలరు తీవ
పట్టలేకయ యటు నిటు ప్రాకురీతి
మరణ మొందగ నేను, నిర్భరతరార్తి
నెటుల బెఱపంచలం బ్రాక నేగుబుత్రి

అనియిటు, తేలుగుట్టినటులాంగని పోటులు డొక్కలో గలం
చిన నిలుసేరనెంచి యలజేయిడి లేనగడంగ గన్నుల
ల్లన దిరుగంగసాగె; నొడలం జిఱు చెమ్మట లుప్పతిల్లె; ద
ప్పినిగొనిశక్తిచాలక భువిన్ శయనించెనతండు మూల్గుచున్.