పుట:2015.333848.Kavi-Kokila.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

---వ న కు మా రి

అనిన విని లతాంగి యనెనాదుస్మృతి పధ
మంటియందు శైశవానుభూతి,
దాని జింతసేయ దనరు గన్నుల గట్టి
నట్లు బాల్యచర్యలన్ని యిపుడు.

గిరిందీరంబులనల్లి, ముంఘంమరవాకీర్ణ ప్రవచ్చారు ని
ర్ఘరిణీ శీకరపోషితంబులయి యశ్రాంతంబు సౌరభ్య బం
ధురతంజిల్కులతావితాపముల బ్రత్యూషంబునం జేరి సుం
దర వర్ణాంకిత పక్షుముల్ గలుగు సీతాకోకముల్ పట్టుదున్

స్వచ్చముగ బాఱు సె;లయేటి జలమునందు
ఆకుపక్కెలు త్రుళ్ళింత లాడుచుండ
మునుగుచుంటిని; జేపలబుణుకుచుంటి

గొఱ్ఱెపిల్లల నమ్ముల గూడ గదిపి
పాలుత్రావించి యావల బట్టువఱతు;
ఎన్నిముద్దులు పెట్టిన నేమి యనవు;
అట్టి కొదములె పసినాటి యాట చెలులు.