పుట:2015.333848.Kavi-Kokila.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

నిన్నుగనుంగొన్న వికసిమపనున్న సుమము
రీతి పొడకట్టు; మాతండ్రి, యా తపమ్ము
హతినిశోషిల్లి వృంతసంచ్యుతిని బొందు
సాంధ్యకాలపు బువ్వునా సడలంచుండు.

వెలది వచించుపల్కులకు విస్మయమొంది, యిదేమిజన్మమా
దిలతిత పుష్పపత్ర తరుదీప్తి మనోహరమైన కావలం
జెలియనసించెనో మనుజజీవిత తత్వమెఱంగిదో, భువిం
గలిగిన మంచి సెబ్బరలుగాంచ దమాయిక యంచునిట్లనున్

సకల తారాశ్రయంబైన చదలుగనంగ
నెంత విరివియై చూపట్టు నిలయమునం తె
జన్మమరణముల్ రెండు విశ్రాంతిలేక
జరుగు చుండును నీ ప్రపంచంబునందు.

జననమునొంది, తల్లి తమిసాకబెరింగి, విముగ్దశైశ వం
బున మదినెట్టి దు:ఖమును బూనక యాటల బ్రొద్దుపుచ్చి, యౌ
వన సమయంబునన్ విషయవాంచల దేలి, జరాగృహీతుడై
మశుజుండు లోక జీవనముమాని చనుంబరలోకమంగనా.