పుట:2015.333848.Kavi-Kokila.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

---వ న కు మా రి

ఇతని దిలకింప దిలకింప నేమొగాని
పూర్వ దయాకులత్వంబు పొడవడంగి
జనక సందర్శనంబున మనము పొంగు
నటుల బ్రణయోదయమ్మయ్యెనని తలంచు.

ఆవని జనకునికన్నను నన్యమైన
మనుజరూపంబుగాంచి యా వనకుమారి
స్వీయజీవిత కావ్య ప్రవృత్తియంచు
నభి నవాశ్వాసరచనకు యత్నపడెను.

క్రొత్త యనుభూతి బలమున జిత్తమందు
నవనవాశయ ఘర్షణం బవతరింప
మునుపు సంకుచితంబుగ బొనరుజగతి\
విరివిగాదోచె ద్రుటిలోన వెలదికపుడు.

కనుగోనెంచి నవప్రపంచమనియె గంజాక్షియావీరునిం
గని, యాలోక నివాసులెల్ల భయముంగల్పించు ఖడ్గంబులం
గొని చేలంబులు శోణితాంకితములై క్రూర ప్రచారంబులన్
దినముల్ పుత్తురె చెప్పుమా, జనకుడీ తీరుల్ వచింపండుమున్