పుట:2015.333848.Kavi-Kokila.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

వెలది తలపొరల ద్రిప్పెను;
బలుమఱు నిట్టూర్పు విడిచె భానభరంబున్
వెలికూర్చుచున్నదోయన;
తలపులు చెదరంగనీక తాబోరామెన్

కోరికములువిచ్చుతీరుగాగ నిమీలి
తాక్షులల్ల దెఱచి యాలతాంగి
వలియుడంగ మేను వలిపముతొ నద్దు
నదయుగాంచి చకితహృదయయగుచు.

పలుకను నోరాడక యెం
దుల దాగూర్చుండి నదియుదోపక తుదకుం
గలగని మేల్కని నట్టుల
నులికిపడుచులేచె దరుణి యుద్వేగమునన్

ఏయెడనున్నదాన, నిటకెవ్వరుదెచ్చిరి, నవ్యరూపముం
బ్రాయముగల్గు నీ వవరు?, స్వప్నమొ! లేక నిజంబె
                                        యౌనొ! మా
నాయననుం గుటీరము గనందగుదారెది, శోణితాంకితుం
డై యనకుండుదోచెనపు, డాతడె నీవని సంశయించెదన్