పుట:2015.333848.Kavi-Kokila.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

అట్టెనినున్ నయ: పరిణతాంచితకుంతలు, సాధుచిత్తునిన్
దిట్టతనాన గష్టములదించితి, ముంచితిదు;ఖవార్ధి, నా
యట్టి అదృష్టహీన తనయంగను తండ్రికి శోకభారసం
ఘట్టన గల్గుటబ్బురమె; కష్టములొంటిగ వచ్చునే యెటన్.

అని జనకున్మదిం దలంచి యూరట గూరుచు నీరజాక్షి దృ
ష్టిని బ్రసరింప నీయకకడింది గలంచెడు బాష్పపూరముల్
గనుగొనలందొరంగి చిఱు కాల్వలుగట్ట గుటీరసీమకుం
జన దమకించునంత నొక చాయనులవ్వని కూత రేగినన్

వినియది యేమటంచు నతివిస్మితయై లలితాంగి యంత ద
 ద్వనికట ప్రదేశముల బాఱగ జూచి చలత్తలెల్ల తా
  జనిత నితాంతకాంతి, గిరినామ తలంబుల నున్న గొఱ్ఱెలు
 గనె శునకంబు మందచెడగా నెడమీయక వెన్నడింపగన్

పెన్నిధి గాంచినట్టి నిఱుపేద విధంబున సంతసించి యా
కన్నియమంద జేరి తమ కమ్మున గాపరి కుక్క నెత్తిపై
కొన్నదయన్ శిర:స్దలము గోళులదువ్వుచునుచ్చు గొట్టుచున్
మిన్నకముద్దు పెట్టెనుదమిన్ శునకంబు గదల్ప బుచ్చమున్