పుట:2015.333848.Kavi-Kokila.pdf/5

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


నలజారమ్మ

జానపదులు గోరు చక్కెఱ బెల్లంబు
నుప్పు మిరపకాయ పప్పులాది
వస్తునికరమమ్మి నైశ్యులాప్రోలను
సర్ధ్గనిధులగూర్చి యలరుచుంద్రు.

కుక్కుట జాలంబం కొక్కొరో యని కూయ
       నీల్గుచు మూల్గుచు నిదురవైచి
యతివల కౌగిళ్ళ నల్లన సడలించి
          తల్పంబులన్ డిగి తడవికొనుచు
నడకటిండ్లను వీడి తడుపు బాతయు నెమి
       కఱ్ఱయు గైకొని కడు రయమునం
బైరుపచ్చలుచూడ్ద బనులను గాపాడ
        మడవలుగట్టంగ మడులుదున్న

నెండవాన లనాక యుద్ధండలీల
బ్రొద్దువొడిచిన దాదిగా బ్రొద్దుగ్రుంకు
వఱకు బొలముల గష్టించి వచ్చుచుందు
రప్పురంబున యువకులౌ హలికవరులు.