పుట:2015.333848.Kavi-Kokila.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

---వ న కు మా రి

ఇనముదొరంగు పత్రముల నింపులుచిల్కెడు పూలగుత్తులన్
నవసరసీజ బాంధవుని నందనలక్ష్మీసమర్చసేయు ప్రొ
ద్దువొడుపు వేళలన్ మురళితోడయి వీనులవిందుసేయ మం
దవనుల మేపుచుంటిని ముదంబలరం దొలిమంచు పచ్చికన్.

   ఇంక నే వ్యాజమునవచ్చి యీప్రదేశ
   ములను దర్శింతు - జెల్లె బోమోహనంబు
   లైనప్రకృతి విచిత్రంబు లరయుకోర్కె;
   కాలమెవ్విధి గడదాక గడపికొందు.

చటులానిలమువీచి పెటపెట దరుశాఖ
    లొండొండు విఱిగి వనోర్విజాఱ,
నీడ జంబులుగట్టు నీడముల్ చిందఱ
   వందఱై పోవంగ బక్షిశాబ
కములుగాయములొంది 'కావుకా ' వని కూయ
   గరుణమై వృక్షకోటరములందు
జివురుటాకులుపేర్చి చిన్నికూనల జేర్చి
   కాచుచుంటిని గదాగహనసీమ