పుట:2015.333848.Kavi-Kokila.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

    అట్టులలవోక జలకంబు లాడియాడి
    గట్టునకు జేరిపుట్టంబు గట్టికొనగ
    అతినగన్పట్టె గ్రొంబొగలావరింప
    నడుమ వెలుగొందు హొమాగ్ని నాల్కవొలె.

   చికురముల వ్రేళ్ళ ద్రువ్వుచు జిక్కెడల్చి
   మెల్లదడియార్చుకొంచు బ్రవుల్లనదన
   గాలికెదురేగ రాహువు కజళనేచ్చ
   చంద్రబింబంబు వెన్నాడు సరణిదోచు.

అఱగొఱచీర యంసముల నందియునందని పైటచెంగె యా
తరుణికి లోకమిచ్చినయుదారపు నాగరికంబు; శేష సుం
దరతసమస్తముబ్రకృతి దానె యొసంగెను; నాగ రాంగినా
పరిచితమైనలజ్జ యెటువంటిదొకన్నె యెఱుంగ దింతసన్.

కరమునదోటికఱ్ఱ, మొలకట్టున బిల్లనగ్రోవి, క్రొమ్ముడిన్
విరిపొరలందగింప నడవింజను దెంచుచు నొక్కచోట ము
మ్మరముగఝుంకరింప మధుమక్షికముల్, తలయెత్తి చుట్టు న
ట్లరయుచునుండె దేనె పెరయాకుల దాగెనటంచు నెంచుచున్.