పుట:2015.333848.Kavi-Kokila.pdf/4

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నలజారమ్మ

శ్రీ సింహరీ మండల
కాసార మరాళమనగ గాంతిల్లి రమా
వాసంబయి సతతంబును
వాసి న్గుచూరు మిగుల వర్ధిలుచుండున్.

ఖలులను సంస్కరింప దమకమ్మున శిష్టుల రక్షసేయగా,
నిల హరి విగ్రహంబయి రహింపగ, సంత నికుంశవిష్టశుం
బలరగ దేవతాయతన మయ్యెనొ నా నుతికెక్కు సప్వరిం
గల ప్రతి దేవమందిరము కంద సమాశ్రిత గోపురంబుఇగన్,

నెలకొని భూసురోత్తములు వీరజమడ పరాగ పూగ సం
కలిత జలప్రపూర్ణయయి క్రాలు జలాశయమందు వేకువన్
సలీలములాడి వేదవిధి నక్కగ దీర్చి విధాతలో యనం
తెలుపుగ వేదశాస్త్రములుసెప్పుచునుందురు శిష్యకోటికిన్.