పుట:2015.333848.Kavi-Kokila.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

బందుగుల జెలిమికత్తెల
నందఱ గౌగిటనుజేర్చి యాదరమున వా
ఱందందు నిచ్చుకానుక
లందుచు జనుదెంచి చంచలాంగియు భక్తిన్,
 
తల్లిదండ్రులకున మ్రొక్కి యుల్లమందు
దేవదేవుని జింతించి దీప్తిజలగి
మందహాసము సెలవుల గ్రందుకొనగ
నగ్నిగర్భంబు సొచ్చె నయ్యతివిమిన్న,

సాంధ్యరగశ్చటా సంచాదితస్తాద్రి
     కటకసుందర దభ్రఖండ మనగ,
జులజారగ కలితోర్మి మాలికా
    డోలికా చంచ న్మరాళమనగ
బల్లవితాశోక పాదపాశ్రయ నవ
    ప్రసవభారావత వల్లియనగ
గైరికసింధూర కలితపూర్వాచల
    పీఠస్ధ పూర్ణేందు బింబమనగ,