పుట:2015.333848.Kavi-Kokila.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

కూతురైనను నీవె కొడుకైనను నీవె, మా
    కెవ్వరున్నారిక నిజ్జగమున.
గాటికిగాల్సాచు కాలంబునను మమ్ము
    దు:ఖాన ముంపంగ దొడరీతంట-?

నన్ను గన్న తల్లి, నామాటవినవమ్మ,
కన్నకడుపు నిట్లు కలచిపోవ
ధర్మమగునె? యంచు దల్లి యెలుగురాయ
బలికి, చెక్కునిముర బడతి యనియె:

నాకొఱకు గాదె నాపతి
నీకను బ్రాణంబు విడిచి విశ్వమునందు
బ్రాకట యశమును బొందెను;
నాకును నట్తిదియనూవె న్యాయముతల్లీ.

నావుడు బంధుజాలము వనారిలె, 'మాభవనరిబు లమ్మరో
పావమౌను ద్వల్లలిత పాదసరోజ పరాగసమంపదన్
బావని, రమ్మ ' టంచును నునాసిను లర్మిలివేడ, నామె ప్రే
మావృతచిత్తయై కదిలె నందఱి బందుగులిండ్లకున్ వెనన్.