పుట:2015.333848.Kavi-Kokila.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

శారికమిధునం బటువలె
గూరిమి నిచ్వసింపజేసి క్రూరత నిపుడా
వారిజసంభవూ డేలొకొ
దారుణ విరహంబుగూర్ప దలచెను గట్ట !

అని దీనగద్గదోక్తులు
మొనయగ వచియించు భర్తమొగముం గని,
మనియెదునధా, నీనతి
నిను వీడునె స్వర్గమందు నిరయంబునేన్?

అన విని, కన్నీరొలయగ
గొనబగు బసిపాప ముద్దుగొని పతియేగన్
మనమున శ్రీహరి దలచుచు
ననవుగ బాలెంత స్నానమాడి పసవునన్

జాళువా బంగారు డాలుడీలంగజాలు
     హరిద్రచేలంబు సంతగట్టి;
పసమునిగ్గులుదేరు ఫాలభాగంబున
     సింధూర తిలకంబు పొందుపఱచి .