పుట:2015.333848.Kavi-Kokila.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

తనయా, యెంచను, నేమియున్నవినుమాధర్మంబనున్, ఏమినా
నిను నెవ్వారలు పిల్చిరంచు గినియున్, నీవేగదాయన్న ఏ
మనుదండ్రీ, యిదియేమె వెఱ్ఱియనగా హాయందునవ్వుంగడున్
ఘనశోకావిలచిత్తుడై శిరము వీకందాకు బెన్బిత్తికిన్.

మాటికి జొన్నకంకులన, మాదిగవాడన గొర్తవేంత ము
మ్మాటికి దప్పునేయన, క్షమాపణలేదన, నౌను గాదనం
బాటిలె దు:ఖమెట్లు విడబాటగు వంచన దండ్రి,భీతి న
ప్చాటలగంధి డెందము గభాలన గంతకితాంగవల్లియై.

   నలజారమ్మ తండ్రిని బరికించి నాయనా, మాదిగవా
వాడెవడు? జొన్నకంకులెక్కడివి?. కొర్తవేంత యేమి? యని
ప్రశ్నించుచుండు నంత, వెంకటరెడ్దియు జొన్నకంకులు దుప్పటి
యందుగట్టి భుజముపై వైచికొని యిలుజేరి, భార్య ప్రసవిం
చుటవిని సంతోషించుచు బురిటింటిలోనికి వచ్చె.

వచ్చినభర్తమూపయి బట్టుగ మూటెడు కంకులుంట నీ
తెచ్చిన కంకులెచ్చటివి? తెచ్చితివో మన చేనినుండి, లే
కెచ్చటనుండి తెచ్చితివి? యేమనందొయ్యలి, వల్లబోయి రా
పచ్చు పడంగజిత్తమున నచ్చట గంకులువోసి భర్తయున్