పుట:2015.333848.Kavi-Kokila.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

అని పితచేతుల్ శిశువునాన్చిన గాంచి వచించునాతడో
తనయ స్వబంధువర్గము ముదంబును బొందగ గందునోర్తు నా
వనజభవుండొసంగె, మనుభక్తి నొనర్చిన నోములియ్యెడు
దనువుగ్రహించి కూతురుగ ధాత్రిజనించెనుగాక యన్యమే?

    అనవిని నలజారమ్మయు
    దనయను మంచమునబెట్టి తాను బరుండెన్;
    జనకుండిట్లనె, మొగముం
    గననీయక లోనివెతలు గనరానిబటుల్.

నామదినొక్క సందియము నాటెను, బాటిగ దానిబుచ్చ న
త్యామల నీతివాక్యముల నమ్మ, వచింపును యుత్తరంబుగన్
ధీమహితుండయేని యొకతీరున జిత్తము తత్త-కింప దా
నేమియు జేయజాలడు, మఱెవ్వరు యోచనసెప్పు నంతకున్

చౌర్యము నెచకృత్యమని, శాస్త్రవిరుద్ధమటం చెఱింగియున్
దుర్యశ మెప్ప సల్పు నతిదుష్టున కెమ్మయి శిక్షసేయగా
నార్యులకు న్ముదంబగును న్యాయముసెప్పు; మీజారుదారు దు
ష్కార్యనియుక్త చిత్తులను గాఱియవెట్టగ వీడవచ్చునే?