పుట:2015.333848.Kavi-Kokila.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

అల్లుడటంచు నాతడు దయామతి మన్ననచేసె గాకతా
బెడ్లుగశిక్షసేయవె? విభేదము లెంతురె యోగ్యులంచు న
న్నెల్లరు దూలనాడిరె? యహీనయశంబెటు వీడనౌను? నా
జెల్లవిధంబులన్ నిధిగనేర్పడె నాతని శిక్షసేయగన్.

నలజారమ్మను గర్భిణీ
దలపోసిన నామనంబు తద్దయునీరౌ:
తెలుపక పతికృత్యమునే
సలహా యిమ్మందు ధర్మసందేహమునన్.

అనియిటు లేవబోవు సమయంబున బల్లేతయోర్తు చేరవ
చ్చి నగుమొగంబునంబలికె చిన్నినిసుంగు జనించె నిప్డుకూ
తునకు నటంచు; నంత నెద దోరము సంతసముప్ప తిల్ల వే
చని పురిటింటిలో గనియె జక్కనిపాపను బొత్తిగుడ్దలన్

నలజారమ్మయు దండ్రి, గాంచి మది నానందమ్ము దిఅవాటి వె
న్నెలగ్రొన్నిగ్గులుకన్నుదమ్ములొలలయన్వీక్షించి యోతండ్రియా
జలజాతాక్షుకృపావిశేషమున మత్సర్వాఘములూలి ము
ద్దులకందొక్కటిగల్గె గాంచుమిటు సంతొషంబు దీసింపగన్.