పుట:2015.333848.Kavi-Kokila.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

బైరుచేలకు నేగు సిరికప్రకరంబు
    లొండొరు బిల్చు పెన్నుపులి లొప్పె,
గొఱ్ఱెమందలలోన గొల్లల పిల్లన
     గ్రోవిసంగీతంబు కొమరుమీఱ.

లేగదూడలు పల్పులు లాగికొనుచు
నఱ్ఱులెత్తుచు దోకలు జిఱ్ఱకొట్టి
యంభరావంబు సల్పుచు నాలమంద
బాల కఱచుదుండె నిబ్బరముగాగ.

కాముకేళుల నిశియెల్ల గడపి యొడలు
మఱచి నిదురించు యువతుల మందలింప
జూరుసందులనుండి బంగారుసూదు
లవలె చ్యాపించె నరుణాంశులవము లిండ్ల.

శ్రుకృతి చైతన్యభాచమువాసినట్టి
సంతమసమును హరియింప సమయవైద్యు
డలరు పారద సింధూర గుళికనైచె
ననంగ నుదయించె రచింబింబ మరుణదీప్తి.