పుట:2015.333848.Kavi-Kokila.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

చనుమొనలు నల్లవాఱెను;
మినిమినవిడి పెదవులోలసె మృత్తికతావిగ;
దనరెను జిట్టుము లరుచియు;
దనువున శ్రమహెచ్చె; గౌను తరుణికి బలిసెన్,

ఇటుల నా బోటి దుర్భర గర్బాలసమైయుండ నొక్కనాడు

కాలశాక్తేయు డంధికాకాళి కధిక
భక్తి గడసంజ తగరును బలిగనీయ.
గ్రొత్తనెత్తుటిధరలు గురిసెననగ
జేవురించెను దిక్కులు చెలువుమీఱి

పండి యఱ్ఱులువంచు పైరుజొంపములకు
   జాళువాపూతలు గీలుకొల్చి,
కన్నెపయ్యెర కల్ల గదలచు దొగాడు
    జలడబాలల కెఱ్ఱి కలప మలది,
కుజకోటరంబుల గూర్కెడు పెనుగుడ్ల
   గూబల మాంధ్యంబు గొల్లగొట్టి,
యెండరాపిళ్ళకు నెరియు క్రొన్ననలకు:
   బూర్వరాగంబును బొదలజేసి,