పుట:2015.333848.Kavi-Kokila.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

పిట్టలకైన సంతసముపేర్చును బిల్లలగూడియుంట; నా
కట్టిడి బ్రహ్మయేలోకొ సుఖంబులు సంపదలిచ్చి యొక్కనిం
బట్టినింగల్గజేయుండు? ప్రపంచము నందిక నిట్టిజీవితం
బెట్టులయిచ్చనౌను; హృదయేశ్వర, యీశ్వరచిత్త మెట్టిదో?

అనవిని భర్తయిట్టులను; నంబుజలోచన, యీశ్వరున్ వృధా
పనవుచు దూఱనేల?; మనపాపము కొండలమీఱ నూరకే
వనరిన నేమిసేయగల వారము? పారము మిఉట్టకుండనే
మనయభిలాషకి వృద్ధులమె? మానుముశోకము; బూనంమోరిమిన్.

    ఐనియిటు భార్యను హలికుడు
    చనవునదాగుస్తరించి సంతోషమునన్
    మునుపటిచలె సంసారం
    బొనరుచుచుండగ దైవయోగముచేతన్.

     నెలమసలె; చీరచెక్కెను;
     బులునులపై నిచ్చగలిగె, బొసగెగతులయం
     దలసత; నెలతకు జెక్కుల
     వెలిజిగి దలకొనియె; నళులు బెరసెను జదునై,