పుట:2015.333848.Kavi-Kokila.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

కాంచి, విషామెదం దను
ముంచుకొనం బల్లవోష్ఠిముందుకుజని యూ
హించన్నేరక హేతువు
కొంచెముసేపూరకూడి గొణగె నతడున్

ఇరుగుపొరుగుగఱిత లెవరైన నీతోడ
దగవుపెట్టుకొనిరో! తల్లిదండ్రు
లేమితిట్టినారో! లేమరో! సెప్పుమ
హృదయమందు గుందు టుదుటుదీఱ.

విరిసిన తమ్మి దేటిజత వేడ్కమరందములాని యెక్కువనై
న రసముగ్రక్కెనోయనంగ నాతిరొ కన్నులబాష్ప పూరముల్
పొరలగనేల? కేలనుగపోలము నూనగనేల? బేలవో?
చిరుతవో? చెప్పరాదొ? యని చింతదొలగగ భర్త వేడినన్

విని, విరిబోణి లేచి మృధువీక్షలకాంతి విషాధతప్తమై
కణితలు గట్టెనోయనగ గజ్జలసమ్మిళితాశ్రుబిందువుల్
నొనక నిజాంగుళిం దొలగద్రోయుచు నిర్మల దంతధీధితుల్
సునముగనోష్ఠరామును గప్ప వచించె హృదంతకవ్య్లధన్