పుట:2015.333848.Kavi-Kokila.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

అప్పుడవిచ్చి తావులను నల్లన జల్లుసరోజ మండమున్
 గుప్పున జేరి షట్పదము గ్రొలుమరందము; కృతిమంబుగా
 జొప్పెడు పూవమూల్యమయియుండియు నేమి గ్రహింపనందు లం
 జొప్పడునే మధువ్రతము చూఱులు గొట్టేడుకమ్మ దేవియల్

పుట్టిననాట గోలె దరుపూగము నీడలు విశ్రమింప గం
 గొట్టములై చెలంగ నవిగొఱ్ఱెల మేపు ప్రీతిగా, రసం
 బుట్టగ వేణుగానముల నోపికయట్టు లొనర్చికొందు నా
 యట్టి కుమారి నేనయని మాడుచుచుందు బ్రభాతవేళలన్.

శ్యామలోర్వీ ధరయిల సాంధ్యవేళ
 జలధరాచ్చాదములపైకి నలమికొనెడు
 కలిత కిమ్మీర వర్ణంపు గాంతులకును
 సకల సామ్రాజ్యసోఖ్యంబు పాటియగునె?

సరసి మృదుపంకలగ్నమై తరంగలందు
 బాళి జెరలాడు కమలిని నాళమేల
 పెఱికినాటేడు మోహాన బెరటియందు;
 జావకయ్యది బ్రతుకునే సదలాత్మ.