పుట:2015.333848.Kavi-Kokila.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

---వ న కు మా రి

తెలియక యంటివేమొపొలతీ,జగతిన్ జనియించుటెల్ల ని
  శ్చల బహుభాగ్యభోగములు సన్ముతిమె భుజియింపనేగదా
  లలితసుమంబు కాననతలంబునబుట్టి జనోపభోగ్యమై
  వెలయక వాడునట్టు లడమి గృశియింప దలంప బాడియే.

మనదగు జీవితంబు, ఘనమార్గమునన్ దిగజాఱి దిక్కులె
 ల్లను నిజకాంతి హేమరుచులన్ వెలిగించి క్షణంబులోపలన్
 మనిగెడు నుల్క రేఖయనుమాట యసత్యముగాదు; కావునం
 దనువును బ్రాణముండగనె తన్వినొ,సౌఖ్యములందమేలగున్

అనవుడు, యోచన మెయి న
 వ్వనితయు మృదుమధురసరణి వాకొనెనిటు; లి
 వనుల వసించియు మిత్రుడు,
 గనకుందుమె యట్టి సౌభ్యగతులు ముదానన్

ఆకలుష నిర్ఘరీజలరసాయనముల్, కిసలోజ్జ్వలల్లాతా
 ప్రకరములుం దృకోర్వులునుబెసెరురంగకుమారి హేమ ర
త్న కలిత పంజరాంతరము నన్నివ్చసింపెగ జేయురీతి గొం
 కక యచరోధ సౌధమున గట్టగ నెంచి తనన్ను నిచ్చలున్.