పుట:2015.333848.Kavi-Kokila.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

పూవుబందిళ్ళు క్రొందావి పుక్కిలింప
 గున్నలేమావి నీడలగూడి, చైత్ర
 కాంతు బరిణయమాడు వాసంతలక్ష్మి
 అంత మొందు శరజ్జరాగమమున.

అవియు నివియమనేల యోయబ్జనదన,
 అంతరాళ చరిష్ణుడౌ నర్కుడాది
 యఖిల కవిత్ర్రచయము కాలాంసృతిని
 ఐక్యమైపోవు వరాల పదార్దమందు.

జలధి తరగలు పుట్టుచు సమసిపోయి
 మరల జనియించునో జనోహరిణనయన,
ప్రకృతి మార్పుల జెందుచు బరగుగాని
 వ్యయము నుత్పత్తిలేదు మూలాంశమందు.