పుట:2015.333848.Kavi-Kokila.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

---వ న కు మా రి

రాత్రి నిద్రానిబద్ధమౌప్రకృతి యిపుడు
 విమల కల్యానిలబులు వీచుచుండ
 దరుణ సూర్యాంశువుల బ్రభోధంబునొంది
 నిత్యకృత్య ప్రవృత్తమై నెగడుచుండె.

నెలతుక నిద్రలేచి యటు నీలిగిమాలిగి దేహమాంద్య ముం
 దొలగి సఖుండ, రాత్రియెటుదూగెనుదండ్రి?శ్రమంబుతగ్గెనే?
 మెలకువ నున్న వాడెయనిమిత్రునిగాంచ,నధోముఖుండుగం
 బలుక కయున్న నాతడు, గుభాలున సంశయముప్పతిల్లగన్.

జనకుని గనుగొన నాతడు
 కనుమూసింస యట్టులుండె; గాంతిదఱిగె మో
 మున; మార్చు చిహ్నమేనియు
 గనుపట్టదు, తనువు మంచుగడ్డటులుంచెన్.

యువకుడు కాంతసంశయము నూహమొనర్చి నిజంబుదెబ్బ కె
 ట్లవు? మరణంబు దాచగలమా? యనిధైర్యము బూని పల్కెనా
 యువు గతమయ్యె నాయనకు; నుమ్మలికంబున గ్రమ్మరింపనే
 రవు; భువిబుట్టి చచ్చుటలు ప్రాక్తన కర్మఫలంబులంగనా.