పుట:2015.333848.Kavi-Kokila.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి—-

గిరుల సెలయేళ్ళగోగెడు తరుణములను
 అందు బ్రతిబింబితంబౌ మదాననంబు
 గాంచి యనుకొందు మాతల్లియంచు మోము
 సైత మిటులుండునోయని సంతసమున.

ననునొంటిగ నీవనివిడి
 చనుదెంచ దలచినావె? సర్వమునీ ఏ
 యనుకొందు జీవితంబున;
 నినుబాసి క్షణంబు బ్రతుకనేర్తునె తండ్రి

అని వచించెడి నంతలోనతనిబ్నదన
 మందు మృత్యువు తాండవమాడు దొడగె,
 నెత్తలేక పక్ష్మలములనెత్తి సుతను
 దరుణు భావగర్బిత దృగ్విధంబుదోప.

గాంచుచుండగ, ఎలమెల్లగ గన్నుదోయి
 ముకుళితంబాయె రే దమ్మి పూవుపగిది:
 బక్ష్మలంబులు జీవ కవాటములును
 నొక్కసారిగ బిహితమై యుండ్నేమొ!