పుట:2015.333848.Kavi-Kokila.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

—-వ న కు మా రి

కావునన్నెట్టివారలను గాలముడాయ సమస్తవైభవం
 బే విధినైనబాసి దివికేగకతపోదు;మృత్యుదేవతా
 భావమున్ దరిద్రులని భాగ్యయశ:ప్రధితాత్ములంచు సం
 భావనయున్నె? కూటమితు బాయుట నిత్యనిసర్గధర్మముల్

మరణద్వార కవాటముం దెఱచి సమ్మానింప మీతల్లి ప్రే
 మరసావిష్కృతదృష్టులన్నెఱపియమ్మా, నన్నుగస్సన్నలన్
 నరగంగాసికతాప్రదేశముల గల్పక్ష్మాజ కొంజాలయాల
 తరితచ్చాయల విశ్రమింప ఇలిచెందాపమ్ము శాంతింపగన్.

జనకుందిట్టుల బల్కగూతురనె నాశ్చర్యంబు దోపంగమా
 జననింజూచుట కేగెదో దివికి జంచద్గాంగ కల్లోలసం
 జనితాలోల మరుత్కికోరములు విశ్రాంతిన్నివేదింప;నే
 నునునీతోనరుదెంతుదల్లిగనియన్యోన్యంబుముద్దాడగన్

నాజనయిత్రి యెట్టిదొకనన్మది పుట్టెడు, జన్మమాదిగా
 నాజ్ననీమతల్లి, ప్రణయాంకిత కోమల సుస్మితంబు ని
 ర్వ్యాజకృపామహత్వము నిరంతదృగంచలశీతలత్వమున్
 రాజిల నన్ను ముద్దిడియెనా యెపుడైన వచింపు నాయనా.