పుట:2015.333848.Kavi-Kokila.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నలజారమ్మ

పూవుకొమ్మల నెలదేంట్లు మూగి జిమ్ము
జుమ్మరంచని రవళించు జోకదోప
గాంత మణిబంధయుగమున గాంతిగొల్పు
జిలుగు నీలాలగాజులు నులువిలొలయ.

నల్లబూసల పేరులో నాణెమైన
గిన్నెబొట్టు, కడానినవంకీలు, మట్టె,
లుంచుకమ్మలు, ముక్కర యందమొసగు
గలికినెమ్మేని నిగ్గుల చెలిమి కలిమి

దైవభక్తిగల్గి దైవాఱు నాసతి
పతియెదైవమంచు బ్రణతిసల్పు;
దొలసి పూజసేయ, దురితకార్యంబుల
జిత్తమందు జింతసేయ దెపుడు.

ఇంటికినమ్మ, భిక్షమని యెవ్వడువచ్చిన బొమ్ముపొమ్ము నీవంతిరు చాలమంది యని వాదులు సల్పక వడ్లో, బియ్యమో వంటకమో తగుంగొలది వచ్చినయర్దుల కిచ్చి పంపువా
ల్గంటి ప్రమోదచిత్తయయి, కల్గినదిద్దియె యంచు జెప్పుచున్.