పుట:2015.330445.Ghanavritham.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీరస్తు.

ఘనవృత్తము.

ఉపోద్ఘాతము.

                    శ్లో:బోద్ధారో మత్సర గ్రస్తాః ప్రభవస్స్మయదూషితాః
                        అదోపోపహతాశ్చాన్యే జీర్ణ మంగేసుభాషితం ||భర్తృహరి||
                    శ్లో !! కతి చిడ నవబోధదుర్విదగ్ధాః
                          కతిచన సాధువిదోప్యతన్వసూయాః
                          కతిచనవిరసాఃకవిత్వపాకే
                          బతకవితాజనకస్యకిందశాత్తా ||శృంగార సుధార్ణవము||

లోకములో ప్రకృష్టంబగు పతిభకును, పరమదారి ద్ర్యంబునకు నత్యంత మైత్రియోయన్నట్లు. ఏదేశమందుగాని మహాకవులు పేద కుటుంబముల జనియించి జీవయాత్రగడపుటకే యనేక కష్టముల పాలగుట సాధారణముగ వాౙ్మయచరిత్ర లందెల్ల యెడలఁ గానంబడు. ఒక్కొకచో మహా రాజులు, కవిజనబద్దారులు, భోజులాంధ్రభోజు లాయా దేశముల కలంకారములై వెలయు చుందురుగాక. మరియు నాజన్మాంతము దారిద్ర్య పీడితులయ్యును స్వాత్మ గౌరవరక్షణాధురంధరులగు పోతనాదులీ దేశమున లేకపోలేదు. దేశమున రాజు లెంతయౌదార్యవంతులైనను, ఎంతరసజ్ఞులైనను, ఎంతదయ హృదయులై నను, వారియాస్థానములఁ బ్రవేశము దొరుకకమున్నెన్నియో కక్ష్యులు గడుపవలసి యుంటయ, వీరును స్వార్ధపరులగుట నన్యుల యెడనసూ యాగ్రస్తుల గుచుండుటయు, నీ మొదలగు దుస్సాధ్యంబులగు నభ్యంతరములుగల్గుటం జేసి యాకవిశిఖామణులు స్వాతంత్ర్యదీక్షనే బూని "కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్ హాళికులైన నేమి" యన్నమాటస్మరించుచు నట్టి మహారాజుల ప్రాపుఁ బడయక యే స్వతంత్రజీవనమున నెట్టెట్లో కాలము వెళ్లించుచు, నెట్టికష్టముల నైనఁ గవితామృతాస్వాదనమున మఱిచి మహానందాబుధి నోఁ లాడుచుం