పుట:2015.330445.Ghanavritham.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పీఠిక.


ఈకవి చే రచియింపఁబడిన కొన్ని గ్రంధములు చాలకాలము క్రిందనే ముద్రితము లయ్యును కారణాంతరములవలన దేశమునందం తగా వ్యాప్తిఁ జెంది యుండ లేదు. ఈ “ఘనవృత్తము;' సై తమిదివరలో నొకసారి లఘుటీక తోఁ బ్రకటింపఁబడి యుండుట కవియందభిమానముగల కొందఱికి మాత్రమే తెలిసియుండును. అట్టివారిలో మా స్నేహితులగు కొందఱీ గ్రంధమాంధ్ర తాత్పర్య సహితముగఁ బ్రకటించిన, యత్ కించిత్ జ్ఞానముగల సంస్కృతభాషాభిమానులందఱును గురుసహాయము లేక నే స్వయముగ నద్దానంగలుగు రసమునుగ్రోల సమర్ధులగుదురని చెప్పి ప్రేరేపించుటచే నీ కార్యమునకుం దొంకొంటిమి. దీనిని ముద్రించుట చాలకాలము క్రిందటనే మొదలు పెట్టఁ బడినను ఎక్కువధనము కావలసియుండుటచేతను, నతర్కితములగు మఱికొన్ని యంతరాయములచేతను ముద్రణపూర్తియగుట కింతతడవయ్యె. ఇది కాళిదాసుని మేఘసందేశమున కుత్తరకధ యగుటచే నాగ్రంధపాఠకులెల్ల దీనినిగూడఁ జదువనుత్సకులై యుందురను నమ్మకముతో నెట్లో ఈపునర్ముద్రణము నిర్వహింపఁ బడినది. సంస్కృత శ్లోకములకు సరియగు నాంధ్రపద్యముల వాసియిచ్చి మాకు సహాయంబొనర్చిన బహ్మశ్రీ మల్లాది అచ్యుత రామశాస్త్రిగారి క నేక వందనముల నర్పించుచున్నాము. ఇదివరలో నే తత్కవికృత సంస్కృతాంధ్ర గ్రంధముల ముద్రణమునకై చాలధనము వెచ్చించి యుండుట చే మఱికొన్ని గ్రంధముల వ్రాతప్రతులను ఖిలము గాకుండఁ గాపాడుటకు మాత్రమే సమర్ధుల మగుచుంటిమి. గాని దానిని ప్రకటింపఁ జాలమైతిమి. కావున భాషాభిమానము వృద్ధియగుచున్న యీ కాలముననైన మహాజనులీ కవిచేరచియింపఁ బడిన సంస్కృతాంధ్ర గ్రంధముల నింకఁబ్రకటించుటకుందగు పోత్సాహము నిచ్చెదరుగాక.

ఇట్లు,


కోరాడ రామకృష్ణయ్య.