పుట:2015.329863.Vallabaipatel.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లభాయిపటేల్

91

కులే గుర్తింతురు. అంతేకాదు, సమ్మెలుచేయుటద్వారా లభించు నాయకత్వ మట్టే నిలఁబడఁబోదని వారు గుర్తించగలరు కూడ. కార్మికులకు హానిచేయవలయుననికాని, యజమానులకు లాభముచేయవలయుననికాని కాక, మేము కేవలము దేశశ్రేయస్సుదృష్ట్యా ప్రభుత్వభారమును వహించుట కంగీకరించితిమి.

"యూరపును బునరుద్ధరించుట కింగ్లండు, అమెరికా లెంత గట్టి ప్రయత్నముచేయుచున్నవో, యొక్కసారి యాలోచించుఁడు. ముప్పది నలుబదిలక్షల పౌనుల ఋణమును బ్రిటిషు ప్రభుత్వము ప్రారంభించనున్నదను సంగతిని మనము రెండు మూడు రోజులక్రితము విన్నాము. నేఁడు మేము ఋణముచేయ దలచుకొన్న నొక్కఁడును ముందుకు రాఁడు. అందుకుఁ గారణ మాదాయపు పన్నెగవేసినందు కెక్కడ సంజాయిషీ యడుగుదుమో యను భయమే.

దేశమునకు మీ ఋణము తీర్చుకొనుఁడు.

"ఆదాయపు పన్నెగవేయువారిని వెదకి పట్టుకొని శిక్షించుటకు తగు సిబ్బందిని నియమించితిమి. వారొక ప్రశ్నావళిని జారీచేసినారు. వీరు తమ డబ్బునంతను రాఁబట్టుకొనుటకు రెండుసంవత్సరములు పట్టవచ్చును.

"ఇందువల్ల నెవ్వరికిఁ గలుగు ప్రయోజనమేమియు లేదు. అందుచేత దేశమునకు మీరు ఋణపడి యున్నదంతయుఁ దిరిగి యిచ్చివేయుఁడు. ఈ సందర్భములో మాకుఁ దోడ్పడ వలసినదని యనుభవజ్ఞులందరికి విజ్ఞప్తి చేయుచున్నాను. యజ