పుట:2015.329863.Vallabaipatel.pdf/97

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

వల్లభాయిపటేల్

లనే యెదుర్కోవలసి వచ్చుచున్నది. మేము తిరిగి కంట్రోల్సు విధించుటవల్ల ననేకులు వర్తకులు, వారి గుమాస్తాలుకూడ నిరుద్యోగులై పోయినారు.

"మీ డబ్బువల్ల నెవరికి మేలుగలుగుచున్నదో యాలోచించుఁడు. మీ డబ్బు విదేశస్థు లెవరికిని జేరుటలేదు. కేవలము మన దేశీయులకే చెందుచున్నది. మీరు బహిరంగముగా సంపాదించు పక్షములోఁ బ్రభుత్వముతోడ్పాటుతో నెంత సంపాదించినను ఫరవా లేదు. ధరలు తగ్గించుటకు మీరు యధాశక్తి తోడ్పడవలసియున్నది. ఇందు మీరే యొక యుత్తమాదర్శమును బ్రారంభించవచ్చును. ప్రభుత్వము మీకు శత్రువుకాదు. దేశశ్రేయస్సు కాటంకముగా నున్నదని నమ్మకము కలిగినట్లయినఁ బెట్టుబడిదారీతనమును వెంటనే తుదముట్టించవలసినదని నేనే ముందుగాఁ బ్రభుత్వము నర్థించ గలను. పరిశ్రమలను మీరు స్వయముగా నడుపఁగలిగిననే జాతీయము చేయుట మంచిది. మన ప్రభుత్వమును నిర్వహించుటకే తగు సిబ్బంది, చాలినంత ధనము లేకున్నది. మన యుద్యోగులను సంస్థానములకుఁగూడఁ బంపవలసివచ్చుచున్నది. అయినను నా సంస్థాన ప్రభుత్వములు సమర్థముగా నిర్వహించబడుటలేదు.

"అందుచేత మనలోనున్న యవినీతిని బూర్తిగా నిర్మూలింతము. ఈ పనిచేసి, సత్యము, ప్రేమ, న్యాయము ప్రబోధించిన గాంధీజీ యాత్మకు శాంతిఁజేకూర్చుదము. ఈపనిని మనము సాధించఁగలిగిననాఁడు మనదేశములో శాంతి భద్రతలను నెలకొల్పఁగలుగుదుము. ధరలు తగ్గిపోయిన నింక నెక్కువ సౌకర్యములు కావలయునని కోరుట సమంజసముకాదని కార్మి