పుట:2015.329863.Vallabaipatel.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

వల్లభాయిపటేల్

కంట్రోల్సు నమలుజరిపిన మనకుఁ బ్రతిపక్ష మెక్కువయగును. అట్లని మనము కంట్రోల్సు నెత్తివేసిన ధరలు పెరిగిపోవుటయే కాక, యక్రమవ్యాపారు లిది యదునుగాఁజూచి, రాసులు రాసులు లాభములు గుంజుటకుఁ బ్రయత్నించుచున్నారు. దేశములో శాంతిభద్రతలను రక్షించి, సౌభాగ్యవంతము చేయుటకు శైశవావస్థలోనున్న ప్రభుత్వ మేమిచేయఁగలదో, చేయవలసియున్నదో, మీ రీ సరికి గుర్తించియేయుందు రను కొందును. ఇంతవరకు నిండియాప్రభుత్వ మాధారపడియున్న "యుక్కు చట్ర" మిప్పుడు భగ్నమైపోయినది. దానిపని గావలసినంతవఱ కిది బాగుగానే పనిచేసినది. మేము ప్రభుత్వమును జేపట్టుసరికే యీ చట్రము బ్రద్దలైనది. ఇందులో నూటి కేబదియైదువంతు లుద్యోగములను నిర్వహించు విదేశీయులు స్వదేశములకుఁ దిరిగిపోయిరి. దేశవిభజనవల్ల నీ వ్యవస్థ మఱింత బలహీనమైపోయినది. మిగిలినవారిలో ననేకులు మన రాయబారులుగా విదేశములకు వెళ్ళవలసి వచ్చినది. ఫలితముగా నతిస్వల్పసంఖ్యాకులుమాత్రమే మనకు మిగిలినారు. చాలమంది వారు పాతపద్ధతులలోనే వ్యవహరించుచున్నారని విమర్శించుచున్నారు. కాని పరిపాలనానుభవమున్న వారికే వా రే పరిస్థితులలోఁ బనిచేయుచున్నదియు నర్థము కాఁగలదు. బయటివారి కాపని యర్థముకాదు. వారిలో ననేకులు విశ్వాసపాత్రులు, దేశభక్తులు నున్నారు. వా రందరు మాతోఁగలసి యహోరాత్రములు పాటుపడుచున్నారు. వారు మనఃస్ఫూర్తిగా సహకరించుటవల్లనే, కాశ్మీర్‌లో, సంస్థానములరంగములో నితరత్ర సాధించిన