పుట:2015.329863.Vallabaipatel.pdf/91

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

వల్లభాయిపటేల్

సలుపుటకుఁగూడ మన కిప్పుడు తీరిక లేదు. రేయింబవళ్లు పని చేసిననే మన కృషి తృప్తికరముగా సాఁగును. మన సరిహద్దులలో నేమి జరుగుచున్నదో చూడుఁడు. బర్మా, మలయా, ఇండోనేషియా, చైనాలలో నేఁడు శాంతిలేదు. మన పొరుగు రాజ్యము మనపైఁ గన్నువేసి యున్నది. చిత్తశుద్ధి, పవిత్రాంతఃకరణ లేని దేశ మిది.

"ఈ పరిస్థితులలో నీ సమస్యను బరిష్కరించుటకు నా సూచన యేమిటో బొంబాయిపౌరులకుఁ దెలియపఱచఁదలచుకొన్నాను. ఇకనుండియైన సంకుచితమైన రాష్ట్రీయవాదనకు స్వస్తిచెప్పుఁడు ఒకవేళ మీరు రాష్ట్రీయవాదము నవలంబించుచున్నను గొంచెము నిగ్రహముతో మాట్లాడుట యెంతో యవసరము. బొంబాయిసమస్య బెర్లిన్‌సమస్యవలెఁ బరిణమించఁగలదనుట శుద్ధావివేకము. మన మందరము చిత్తము వచ్చినట్టు మాట్లాడుచు, వాతావరణమును విషకలుషితము చేసివేసినట్టయిన నిండియా సర్వనాశనమైపోవును. "సిరి రా మోకా లడ్డుపెట్టి"నట్టగును.

బానిసలుగా నున్నప్పుడు మనకుఁ బరస్పరము గౌరవము, నాప్యాయత యుండెడివి. పరాధీన పరిస్థితులలో మనము పరస్పరము కలసియున్నాము. ఇప్పుడు స్వతంత్రుల మైనతరువాత మన మెందుకుఁ గలహించుకోవలయును?

మన గతచరిత్ర నొక్కసారి సంస్మరించుకొనుడు. కేవలము పరస్పర విభేదములతో, భ్రాతృహత్యలకు బితృహత్యలకుఁ బూనుకొనుటచేతనే మన సామ్రాజ్యములు పోయినవి. స్వతంత్రము వచ్చిన తర్వాత మనము కలహించుకొని, దీనిని