పుట:2015.329863.Vallabaipatel.pdf/90

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
83
వల్లభాయిపటేల్

లకు రక్షణ కలిగినది. నేఁడు ప్రజలలోఁ బరస్పర విశ్వాసము కానవచ్చుచున్నది. పాకిస్థా నిఁకముందు మన విషయములో జోక్యము చేసుకోఁగూడదనియే మనము వాంఛించుచున్నాము. వారు జోక్యము చేసికొనుట యనఁగా ముస్లిములలో, నాతురత, భయసందేహములు,కలుగుట యన్నమాట. శాంతి స్థాపనకే యిఁకఁ గృషిచేయవలయునని మనము ప్రయత్నించు చున్నాము. ఇండియాను మన మేకరాజ్యము చేసితిమి. ఇక దానిని సమైక్యము, పటిష్ఠము చేయవలసియున్నది. శాంతి భద్రతలను,సుపరిపాలనమును మనము నెలకొల్పవలయును.

"మనము సక్రమముగా వ్యవహరించకపోయినఁ జిక్కులు తప్పవు. గాంధీజీ నిర్యాణానంతరము కొల్హాపూరులో నేమి జరిగినదో చూడుఁడు. ఈ సందర్భములో నియమించఁబడిన విచారణసంఘము దర్యాప్తుచేసి మంత్రివర్గము పెద్ద పొరపాటు చేసినదని నిర్ణయించినది. ఇతర ప్రాంతములలోఁగూడ నీలాగే జరిగిన స్వరాజ్యముకంటె బ్రిటిషు ప్రభుత్వమే నయమని ప్రజలు భావించుకొందురు.

"స్వాతంత్ర్యము సిద్ధించిన ప్రథమ సంవత్సరములో నెదుర్కొన్న ప్రమాదముల నిండియా గడచి బయటఁ బడినది.

"అసలు పని యిఁకఁ బ్రారంభము కావలసియున్నది. విదేశ పాలకులనుండి మనము ప్రభుత్వమును స్వాధీనము చేసికొంటిమి. కాని దానిని నిర్వహించు విషయమై మన మాలోచించుకొని దానికిఁ దగు నేర్పాట్లు చేయవలసియున్నది. ఈ మహాకార్యమును మనము నిర్వహించవలసియున్నది. ఊపిరి