పుట:2015.329863.Vallabaipatel.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[11]

వల్లభాయిపటేల్

81

చుచునే యున్నది. కాశ్మీర్ ముస్లిములు మనలను వెళ్ళిపొమ్మన్నచో మన మాలాగే వచ్చి వేయుదుము. అంతేకాని కాశ్మీరీల నూరకే శత్రువులచేతికి విడిచిపెట్టి యక్కడనుండి వైదొలఁగిపోము. టోరీలుకాని, లిబరల్సుకాని, బయటివారు మరెవరైనఁ గాని, యీ విషయములో జోక్యము చేసికోఁగూడదు. కాశ్మీర్ ప్రజాప్రయోజనములకు విరుద్ధముగా వారు చెప్పు సలహాలను వినిపించుకోఁబోము. ఇప్పటికిఁగూడ ప్రతి విషయములోను గల్పించుకోవలయునని వారు ప్రయత్నించుచున్నారు. ఇండియా నేఁడు స్వతంత్ర మయినదని వారు గ్రహించుచున్నట్టు లేదు. అది వారు గ్రహించనంతకాలము వారితోఁ గలసి మెలఁగుట మనకు సాధ్యముకాదు."

పరస్పరప్రేమాభిమానములు కలిగియుండి, యొకరిపై నొకరు తూటాలు విసరుకొనుట యసాధ్యమైన విషయము. కామన్‌వెల్తులోనే మన ముండిపోవలయునని వారి యాకాంక్ష. ఇండియా శ్రేయస్సుదృష్ట్యా యా విషయమును మనము నిర్ణయించుకొందుము.

చర్చిల్ దుర్భ్రమ

ఇండియారక్షణ తనవల్లనే సాధ్యమగునని చర్చిల్ భావించినట్లయిన నాయన నా దుర్భ్రమలోనే యుండనిండు. ముం దాయన యింగ్లండును రక్షించుకొనుట మంచిది. సత్యము, ప్రేమ, న్యాయము - ఈ యుత్తమ గుణములే నేఁడు ప్రపంచమును రక్షించఁగలిగినవి. ఇకఁ బ్రపంచము తృతీయ ప్రపంచ సంగ్రామమును భరించఁజాలదు. చర్చిలుది