Jump to content

పుట:2015.329863.Vallabaipatel.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

వల్లభాయిపటేల్

సందర్భములో నిండియాకాని, పాకిస్థాన్ కాని - యామాటకు వచ్చినఁ బ్రపంచమంతయు నిర్మూలమై పోయినను సరే మనము లెక్కచేయము. పాకిస్థాన్ తనగోతిని తానే త్రవ్వుకొనఁదలఁచుకొన్న, నందుకు దానికిఁ బూర్తిగా స్వేచ్ఛయున్నది.

హైదరాబాద్ భావి

"హైదరాబాద్ సంస్థానమును భాషా సయుక్తముగా విభజించి సరసనున్న రాష్ట్రములలోఁ గలిపివేయవలయునని కొందరు సూచించుచున్నారు. నిజాం నవాబున గద్దెదించవలెనని కొందరు, బాధ్యతాయుత ప్రభుత్వమును నెలకొల్పినఁ జాలునని కొందరు సూచించుచున్నారు.

"ప్రస్తుతమునకుమట్టుకుఁ బ్రతివారు చెప్పునది విని, సమయమువచ్చినప్పు డాయా సూచనలను బరిశీలించవలసియున్నది. కాని యొకటిమాత్రము స్పష్టము. హైదరాబాదు ప్రజల ప్రయోజనముల కేది క్షేమకరమో, హైదరాబాదు ప్రజలు దేనిని వాంఛింతురో దానికే మనము పూనుకొందుము. తమ భవిష్యత్తు విషయమై నిర్ణయించుకోవలసిన బాధ్యత నిజాం ప్రజలపై నేయున్నది. నవాబ్‌ను గద్దె దింపవలయునని కనుక ప్రజలు నిర్ణయించు పక్షములో బయటివా రెవరు నా నిర్ణయమును ద్రోసిపుచ్చజాలరు. ఇది గృహకృత్యవిషయము. దీనిలో చర్చిల్ జోక్యముచేసుకొన్నను నతని తలఁదన్నినవారు కల్పించుకొన్నను సహించుటలేదు.

"కాశ్మీరుకు మన మెందుకు వెడలితిమని కొందరు ప్రశ్నించుచున్నారు. దీనికి సమాధానము విస్పష్టముగా కన్పిం