పుట:2015.329863.Vallabaipatel.pdf/80

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
[10]
73
వల్లభాయిపటేల్

రాజకీయ సమీక్ష [1]

"ఇండియాసమస్య లన్నింటికి బొంబాయి కీలకము. బొంబాయిమార్గదర్శకమైన నిండియాలోని తక్కినప్రాంతములు దాని ననుసరించవచ్చును. నాపట్లఁ బ్రదర్శించిన ప్రేమాభిమానములకు బొంబాయి ప్రజలందరకు నా కృతజ్ఞతను దెల్పుచున్నాను. మీ యాదరమునకు బ్రేమాభిమానములకు నే నర్హుడ నను విషయము నిరూపించుకొందును. నేనికఁ గార్యరంగమునుండి నిష్క్రమించి, విశ్రాంతిగైకొనవలసినవయస్సులో నున్నాను. కాని జీవిత శేషమునుగూడ దేశసేవకే యంకితము చేయవలయునని నా హృదయ మువ్విళ్ళూరుచున్నది. సుస్థిరమైన, బలవత్తరమైన, భాగ్యవంతమైన దేశముగా నిండియా నభివృద్ధిపఱచి, యెవ్విధమైన ప్రమాదము వాటిల్లకుండ దానికి రక్షణ కల్పించవలయునని హృదయపూర్వకమైన నాయాకాంక్ష. ఈ పవిత్ర కార్యసాధనకై నా జీవితశేషము నంకితమిత్తును.

దేశ విభజన

"గత సంవత్సర మిండియా యెట్టి పరిస్థితుల నెదుర్కోవలసి వచ్చినదో మీకుఁ దెలియును. పెక్కు క్లిష్ట సమస్యలను మన మెదుర్కోవలసి వచ్చినది. కొన్నికొన్ని సమయములలో రేయింబవళ్లు మన మాతురతతో, భయసందేహములతోఁగృషి

  1. సర్దార్ పటేల్ తన 74 వ జన్మదినోత్సవసందర్భములో బొంబాయి చౌసాతీలో జరిగిన బహిరంగసభలో నిచ్చిన యుపన్యాస సారాంశము. అంత మహాసభ యెప్పుడును జరుగలేదు.