పుట:2015.329863.Vallabaipatel.pdf/73

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
66
వల్లభాయిపటేల్

విశిష్ట లక్షణములు. ఆయనతోపాటు ముందడుగు వేయ లేకపోయిన కారణమున కొంద రాయనను నిరసించిరి. కాని యసంఖ్యాక ప్రజానీకము సర్దారులోఁ దమకు నచ్చిన నాయకునిఁ జూచినది. ఆయనతోఁగలసి యాయన నాయకత్వమునఁ బనిచేసి భారతస్వాతంత్ర్యసాధనకు స్థిరమైన పునాదిని వేసినది.

"సర్దార్ దుర్భేద్యమైన కోటవంటివాఁడు. ఆయన సలహాను విశ్వసించవచ్చునని యాయనతోఁగలసి పనిచేయు భాగ్యము లభించినవారు గుర్తించియుందురు. ఆయనమైత్రి నత్యధికగౌరవముగా భావించియుందురు.

"భారత జాతీయోద్యమ మాయన సేవానిరతిలో నింకెంతో కాలముపాటు లాభముపొందఁగలదని యాయన నాయకత్వభాగ్యమును బొందుచునే యుండఁగలదని' విశ్వసించు చున్నాను. ఆయన జన్మదినోత్సవ శుభసమయములో నివే నా జోహారు"లని భారతప్రధాని పండిట్ నెహ్రూ జోహారు లర్పించినారు.

"దైవభీతి కలవాఁడు"

26 సంవత్సరములక్రితము మద్రాసులో నాతో మాట్లాడుచు వల్లభాయిపేరును గాంధీజీ యుచ్చరించిన క్షణము నాకుఁ జిరస్మరణీయము. ఆయనను గలసికోవలయునని, యాయనతోఁగలసి పనిచేయవలయునని యొక తీవ్రాకాంక్ష నాలో బయలు దేరినది. నాటినుండి నేటివఱకు నుభయులము గలసి పనిచేసితిమి. ఆయన నర్థముచేసికొంటినని చెప్పఁగలను. సర్దార్‌తో