పుట:2015.329863.Vallabaipatel.pdf/72

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
[9]
65
వల్లభాయిపటేల్

ధారఁబోయవలసినదని యాయనచెప్పుచున్నప్పు డాయన కంఠస్వరములో గాద్గద్యము కన్పించినది. ఆయన యిట్లన్నాఁడు గదా యని యాయనశక్తి యుడిగిపోయినదని భావించవలదు. ఈనాటికిఁగూడ జాతీయాభ్యుదయకార్యనిర్వహణలో నెంతటి భారమును మోయుటకైన నాయన సంసిద్ధుఁడే. ఆరోగ్యము, తుదకుఁ దనప్రాణముకూడఁ బ్రమాదమునకు లోనుగాఁగల యవకాశ మున్నప్పటికి నాయన వెనుదీయఁడు. ఇట్టి నాయకుని యావశ్యకత భారతదేశమున కెంతయిన నున్నది. తన శ్రమ ఫలించిన మహాపర్వదినోత్సవము చూచుటకై యాయన సజీవుఁడుగా నుండవలయునని భగవంతుని బ్రార్థించుచున్నా" నని సందేశమంపినాఁడు డాక్టరు రాజేంద్రప్రసాద్.

"అనుపమకార్యదక్షుఁడు"

"ఇప్పటికి 25 సంవత్సరములకుఁ బైగా మనము సహచరులముగాఁ బెక్కు కష్టముల నెదుర్కొన్నాము. ఈ 25 సంవత్సరములు భారతీయుల కందఱకుఁగూడ బరీక్షాకాలము. ఈ పరీక్షనుగొందరు తట్టుకోలేకపోయిరి. మఱికొందరుయథాపూర్వము గానే యుండిపోయిరి. కొద్దిమంది, చాల కొద్దిమందిమాత్రమే కాలముతోపాటుగాఁ బ్రతిభను బెంపొందింపఁజేసికొని, భారత జాతీయ చరిత్రలోఁ బ్రముఖసంఘటనలుగా నిలచిపోయిన ఘట్టములపైఁ దమ ప్రతిభ నచ్చొత్తఁగలిగినారు. ఈకొద్ది మందిలో సర్దార్ వల్లభాయిపటే లొకఁడు.

"దృఢనిశ్చయము - కార్యదీక్ష - నిర్మాణ చాకచక్యము - జాతీయ స్వాతంత్ర్యమునకై పరిపూర్ణపిపాస - సర్దార్ జీవిత