62
వల్లభాయిపటేల్
దచంచలభక్తి విశ్వాసములు చూపెట్టుటకా యన్నట్టు లత్యంత వైభవముగా జరిగినవి.
70 వ జన్మదినోత్సవము 1945 అక్టోబరు 31 వ తేదీన బొంబాయి కాంగ్రెస్ ఆధ్వర్యవమున బొంబాయినగరములో జరిగినవి. ఆచార్య కృపలానీ యధ్యక్షతను జరిగిన మహాసభలో సిల్కుతోఁ జేనేఁతతో దయారుచేసిన సన్మానపత్రమును, 1600 తులాల తూకముగల వెండికాస్కెట్‌లో (దానిపై గాంధీజీ పటేల్ చిత్రములు చెక్కఁబడియున్నవి) నుంచి 7101 రూపాయలు రొక్కమునిచ్చి పటేల్‌ను సన్మానించినారు.
సర్దార్‌జీ 74 వ జన్మదినోత్సవముకూడ 1948 అక్టోబరు 31 తేదీన దేశమంతట జరిగినది. ముఖ్యముగా బొంబాయిలో ఎస్. కె. పాటిల్ అధ్యక్షతను జరిగినదే యన్నటికన్నఁ గొనియాడఁ దగినది. ఆ సందర్భములో ఎస్. కె. పాటిల్ బొంబాయి ప్రజలతరపున 731 తులాల తూకముగల బంగారముతోఁ దయారు చేయఁబడిన యశోకస్థూపమును సర్దార్‌జీకి బహూకరించినాఁడు. అహమ్మదాబాదు మిల్లుయజమానుల సంఘము వారు 73 వేలరూపాయలు, స్వర్ణ రాజదండము. గాంధీజీ రజత ప్రతిమను బహూకరించిరి.
స్వయముగా ననేకులు మిత్రులు వచ్చి యభినందించినారు. ఆయన నభినందించుటకై యరుదెంచిన స్వగ్రామ వాసులతో మాట్లాడుచుఁ బటే లిట్లన్నాఁడు.
"స్వదేశమే నా స్వగృహము.
ప్రజలే నా బంధుకోటి.
స్వాతంత్ర్యసాధనమే నా జీవితలక్ష్యము.