పుట:2015.329863.Vallabaipatel.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లభాయిపటేల్

53

నుండి తప్పుకొమ్మని పలికినను నా గురువునందుండు భక్తివిశ్వాసములను వీడలేదు. పైగా నాయన కార్యక్రమము కాంగ్రెసులోఁ బటిష్ఠముగా నుంచుటకు బ్రతినపూని పనిచేసినవాఁడు పటేలే. సోషలిష్టు, కమ్యూనిష్టులను దుయ్యఁబట్టి మార్క్సిజంకంటె గాంధీయిజమే ఘనమైనదని ప్రకటించిన గురుభక్తిగలవాఁడు.

అటులనే గాంధీజీకూడఁ బటేలును బుత్రసమానునిగాఁ బ్రేమించువాఁడు. ఆయన ఘనత వెల్లడించినదికూడ మహాత్ముఁడే.

ఒక్కమాటలో, వారిరువురను గుఱించి వివరించవలెనన్న గాంధీజీ యాత్మ, పటేలుశరీరము. గురుశిష్యులకుఁగల సంబంధమును స్వయముగా సర్దారుపటే లిట్లు చెప్పుకొన్నాఁడు.

[1] "మన స్వాతంత్ర్యోద్యమమున కంతకు గాంధిమహాత్ముఁడే యేకైకనాయకుఁడని మీవైస్‌చాన్సలర్ చెప్పినమాటలతో నేకీభవించుచున్నాను. ఆయనచేసిన తపస్సువల్లనే మనకీ స్వాతంత్ర్యము సిద్ధించినది. నేనుమాత్ర మాయన యాజ్ఞలను విధేయతతో శిరసావహించిన యొకసామాన్య సైనికుఁడను. గాంధీజీని గ్రుడ్డిగా ననుసరించు ననుచరుఁడని నన్ను గుఱించి యొకప్పు డందఱు తలపోయువారు. కాని గాంధీజీ నమ్మకములతో, నే నేకీభవించినందువల్లనే యాయన యడుగుజాడలలో నడుచుచున్నానని యాయనకును దెలియును, నాకునుదెలియును. చర్చలన్నను వాగ్యుద్ధములన్నను నాకు గిట్టదు. దీర్ఘ చర్చలన్న నాకుఁగంటగింపు. అనేకసంవత్సరములపాటు గాంధీజీ నేను

  1. కాశీ విశ్వవిద్యాలయ ప్రత్యేక స్నాతకోత్సవములో సర్దారుపటేలు 1948 నవంబరు 25 చేసిన ప్రసంగములోని భాగము.