పుట:2015.329863.Vallabaipatel.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[6]

వల్లభాయిపటేల్

41

1921లో నహమ్మదాబాదులో జరిగిన కాంగ్రెసు కాయన యాహ్వానసంఘాధ్యక్షుఁ డయ్యెను. ఆ యుపన్యాస మతి సంగ్రహమైనది. ఆ కాంగ్రెసులో ననేక సంస్కరణములు జరిగెను. 1920 నాగపూరులోఁ గాంగ్రెసు జరిగినప్పుడు కుర్చీలు బల్లలు నేర్పాటుచేయఁబడుటచే నేడు వేలరూపాయలు ఖర్చయినవి. ఆపద్ధతి యహమ్మదాబాదులోఁ దీసివేయఁబడుటేగాక, రెండులక్షల రూపాయలతోఁ గాంగ్రెసుకొఱకు ఖద్దరుడేరా నిర్మింపఁబడెను.

1922 సంవత్సరములోఁ గాంగ్రెసులోఁ బరివర్తనవాదులు నపరివర్తనవాదు లని (Changers and No-Changers) రెండు పక్షము లేర్పడినవి. పరివర్తనవాదులపక్షమునఁ బ్రముఖులు చిత్తరంజన్‌దాసు, మోతిలాల్ నెహ్రూ, విఠల్‌భాయ్, శ్రీనివాస అయ్యంగార్ ప్రభృతులు. అపరివర్తనవాదుల పక్షమున రాజాజీ, సర్దారుపటేలు, రాజేంద్రప్రసాద్, దేశభక్త కొండా వెంకటప్పయ్య ప్రభృతులు ముఖ్యులు.

పరివర్తనవాదులగు స్వరాజ్యపక్షమువారు, శాసనసభా ప్రవేశమునకై కాంగ్రెసులోఁ దీర్మానము చేయఁబూనుకొన్నప్పుడు పటేల్‌ప్రభృతులు, శాసనసభాబహిష్కారమును, నిర్మాణకార్యక్రమమును సాగించుచు, మహాత్ముని మార్గముననే కాంగ్రెసును నడిపించుటకు బద్ధకంకణులై కాంగ్రెసులోను; దేశములోను, నధికకృషిఁజేసిరి.

1931లోఁ గరాచీలో జరిగిన కాంగ్రెసుసభ కాయన యధ్యక్షత వహించెను. ఆయన తన స్వభావానుగుణముగా, ముక్తసరిగా నుపన్యాస మిచ్చెను. తన కధ్యక్షపదవి యిచ్చిన